పులివెందుల: కోడిపందాలు ఆడితే కేసులు నమోదు చేస్తాం

60చూసినవారు
పులివెందుల: కోడిపందాలు ఆడితే కేసులు నమోదు చేస్తాం
పులివెందుల ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఇది ప్రజలు గమనించాలని ఆదివారం పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎవరైనా కోడిపందాలు ఆడితే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎక్కడ కోడిపందాలు జరిగిన ప్రజలు పోలీసులకు సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. కోడిపందాలు అరికట్టేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్