ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డిని పులివెందుల నియోజకవర్గంలో పలువురు అధికారులు బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీకి పూలమొక్కలు, స్వీట్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆర్డీవో చిన్నయ్య, తహసిల్దార్ లు నజీర్ అహ్మద్, లింగాల ఈశ్వరయ్య, సింహాద్రిపురం నాగేశ్వరరావు, వేంపల్లి సీఐ సురేష్ రెడ్డి, ఎస్ ఐలు నాయక్, రంగారవు, పులివెందుల ఎస్ఐ నారాయణ, హౌసింగ్ పీడీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.