విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన హైందవ శంఖారావానికి పులివెందుల నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. ప్రత్యేక రైలు ద్వారా సుమారు 500 మందికి పైగా ప్రజలు ఈ బహిరంగ సభకు తరలి వెళ్లారు. జైశ్రీరామ్ అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. హిందువుల ఐక్యత, ఆలయాల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్నామని విశ్వహిందు పరిషత్ సభ్యులు వివరించారు.