ఈనెల 17వ తేదీ నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా. స్వభావ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు ఆదివారం తెలిపారు. ఈనెల 17వ తేదీన పులివెందులలోని గాంధీ సర్కిల్లో మానవహారం, మాస్ క్లీనింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు.