తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ, గంగోత్రి అనే తల్లీ, కూతురు హత్యకు గురైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రమణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ తల్లీ, కుమార్తెలు హత్యకు గురైన విషయాన్ని స్థానికులు తెలపడంతో ఇక్కడికి వచ్చామని, ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.