కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేద్దామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బల్లారపు రామాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం వేంపల్లి లో ఏఐటియూసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక వర్గానికి అండగా, వీరి హక్కుల సాధనకు ఏఐటియూసి నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.