జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. మస్తాన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ అంతట వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, వేరుశనగ, కంది, వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయని ప్రభుత్వం కరువు మండలాల కింద ప్రకటిస్తే పంట నష్టపోయిన రైతులు బ్యాంకు ద్వారా రీషెడ్యూల్ మంజూరు అవుతాయన్నారు.