పవిత్రమైన పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారాముల కళ్యాణానికీ తలంబ్రాలు తయారు చేసినట్లు బలిజ సంఘం అధ్యక్షులు నంబూరు కుళాయప్ప, కటిక చంద్రశేఖర్ లు పేర్కొన్నారు. బుధవారం వేంపల్లి శ్రీగౌరీదేవి ఆలయంలో అష్టోత్రాలు, లలితసహస్ర నామాలు, శ్రీరామ సంకీర్తనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలంలో నిర్వహించే కళ్యాణోత్సవానికి సేంద్రీయ వ్యవసాయంతో పండించిన వడ్ల గింజలను మహిళలు గోటితో వలచి తలంబ్రాలు తయారు చేశారన్నారు.