కర్ణాటక రాజధాని బెంగళూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో ఒకే రోజు అన్నయ్య, తమ్ముడు మృతి చెందారు. అన్నయ్య చంద్రశేఖర్‌కు గుండెపోటు రావడంతో తమ్ముడు జగదీష్ అతనిని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అతను చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. అన్న మరణ వార్త విన్న తమ్ముడు జగదీష్.. షాక్‌కు గురై గుండెపోటుతో మరణించారు. ఒకేరోజు రెండు మరణవార్తలు విన్న కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.