అంతరిక్షంలోని కక్ష్యలో విశ్వ పరిశోధన కోసం తమ సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న దేశాలు కేవలం 3 మాత్రమే. 1971లో తొలిసారిగా రష్యా తన అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది. ‘మీర్’ పేరుతో దీన్ని ఆపరేట్ చేస్తుంది. 1973లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘స్కైలాబ్’ పేరుతో తన సొంత స్పేస్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ రెండు దేశాలతో పాటు చైనాకు అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. దీనిని ‘తియాంగాంగ్’ అని పిలుస్తారు.