కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం ఏ మాత్రం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన 3 హామీల అమలు చేయలేదన్నారు. మొదటిది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రెండవది ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడని ప్రశ్నించారు.