ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఏపీ ఎండిసీ పరిధిలో ఉన్న గ్రామాన్ని పరిశీలించడమే తప్ప నష్ట పరిహారం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. శనివారం వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 29/1 లో దాదాపు 20 సంవత్సరాల క్రితం 200 కుటుంబాలు ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు. మైనింగ్ పరిధిలోని అన్ని గ్రామాలకు పరిహారం చెల్లించి మాకు మాత్రమే పరిహారం చెల్లించకుండా పరిశీలన పేరుతో కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు.