చేపలు పట్టడం కోసం కొంతమంది చెరువులోని నీటిని కాలువకు మళ్ళించి వృధా చేస్తున్నారు. చిట్వేలి మండలంలోని అతిపెద్ద ఎల్లమరాజు చెరువులో నీరు నిలిచి ఉండడంతో చేపలు పట్టడానికి ఇబ్బందిగా ఉందని కొంతమంది చెరువులోని నీటిని కాలువలోకి వెళ్లకుండా వేసిన కట్టను తెగ్గొట్టి చెరువులోని నీటిని వృధా చేస్తున్నారు. నీటిపారుల శాఖ అధికారులు చిట్వేలిలో లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.