శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజంపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలోశుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి,పూజలు చేయగా, వేద పండితులు ఆయనను దుశ్యాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదమంత్రాలతో ఆశీర్వదించారు.