రాజంపేట మండలం తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈనెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బుధవారం ప్రోగ్రాం అధికారిణి హేమలత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సగర సంకీర్తన, సప్తగిరుల సంకీర్తన, గోష్టి గానం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, శ్రీరామ పాదుకలు పట్టాభిషేకం నాటకం ఉంటుందని ఆమె తెలిపారు.