అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠిన చర్యలు చేపట్టారు. వీసా గడువు ముగిసినా వారిని, అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశాలకు చెందిన వారిని ఇమిగ్రేషన్ అధికారులు స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా మాసాచుసెట్స్‌లో టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ అంతర్జాతీయ విద్యార్థినికి అధికారులు బేడీలు వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.