పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్‌లో పాస్టర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ నిరసనలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు. ఒక క్రైస్తవ వ్యక్తి అనుమానాస్పద మృతి క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.