నల్గొండ జిల్లా నకిరేకల్‌లో టెన్త్ పేపర్ లీక్ కేసు హైకోర్టుకు చేరింది. పేపర్ లీక్‌లో తనను అన్యాయంగా బాధ్యురాలిని చేసి డిబార్ చేసిన విద్యాశాఖపై విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి పిటిషన్ వేసింది. డిబార్ రద్దు చేసి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డు సెక్రటరీ, DEO, MEO, సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధికారుల తప్పిదమే తన శిక్షకు కారణమని ఆమె ఆరోపించింది.