రామకుప్పంలో ఎంపీపీ ఎన్నిక.. 144 సెక్షన్‌ అమలు

59చూసినవారు
రామకుప్పంలో ఎంపీపీ ఎన్నిక.. 144 సెక్షన్‌ అమలు
కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో నేడు ఎంపీపీ ఎన్నిక జరగనుంది. వైకాపాకు 8, తెదేపాకు 7 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. అయితే, ఇద్దరు వైకాపా సభ్యులు తెదేపాకు ఓటు వేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీపీ ఎన్నికలు అడ్డుకోవాలని వైకాపా ప్రయత్నిస్తుండగా.. ఎన్నిక నిర్వహించి తీరుతామని తెదేపా పేర్కొంది. నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేశారు.

సంబంధిత పోస్ట్