పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది?

69చూసినవారు
AP: తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు పాస్టర్ మరణం వెనుక మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. కొంతమూరు వద్ద సోమవారం రాత్రి 11.43 గంటలకు ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. రాత్రి 11.31 గంటలకు ప్రవీణ్ తన బైక్‌పై కొవ్వూరు టోల్ గేటును క్రాస్ చేసిన సీసీ ఫుటేజీ వారికి లభించింది. దీంతో 11.31 గంటల నుంచి 11.43 గంటల మధ్య ఆ 12 నిమిషాల్లో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్