రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.