సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పిసిసి ముఖ్య అధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ యువతను, రైతులను, మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతను, ఉచిత బస్సు ప్రయాణం అంటూ మహిళలను, తల్లికి వందనం పేరుతో విద్యార్థులను మోసం చేశారన్నారు.