రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం 10 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యాన్ని చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. త్వరలోనే మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.