వీరబల్లి మండల పరిధిలోని మాండవ్య నదిలో ఇసుక రీచ్చులు ఏర్పాటుకు అనువైన ప్రాంతం కాదని విఆర్డిఎస్ సురేంద్రరెడ్డి మంగళవారం ఎమ్మార్వో శ్రావణికి వినతిపత్రం అందజేశారు. నదికి ఇరువైపుల మంచి నీటి బోర్లు మరియు రైతుల బోర్లు ఉన్నందున ఇక్కడ ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల నీటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. గతంలో వచ్చిన వరదల్లో ఇసుక కొట్టుకుపోతే ప్రస్తుతం పంటలకు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.