కడప చెన్నై రహదారిలో పేరుకుపోయిన పారిశుధ్యం
సిద్ధవటం మండలం శాఖరాజు పల్లి గ్రామపంచాయతీ మమ్ముడిగుంటపల్లె దళితవాడలో.. సుమారు 30 గృహాలకు మంచినీరు అందడం లేదని ఆ ప్రాంత మహిళలు శనివారం తెలిపారు. దీంతో పాటు వర్షం నీరు నిలువ వల్ల కొన్ని ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, అంటు వ్యాధులు సోకకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం సమీపాన కాలువలో పారిశుధ్యం లోపం వల్ల అటు ప్రయాణికులకు, గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది అన్నారు.