సిద్దవటం నదిలో వ్యక్తి గల్లంతు
సిద్దవటంలోని లెవెల్ వంతెన వద్ద గల పెన్నానదిలో బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కడప నగరం బీడీ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు పెన్నా నది వద్దకు వెళ్లారు. కాగా వారిలో దేవరపల్లి జేమ్స్ అనే వ్యక్తి(28) ప్రమాదవశాత్తు పెన్నా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు అకక్కడికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.