జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్-బిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన లక్ష 116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని వేదికపై కోరిన 2వ వార్డు కౌన్సిలర్ అనిత, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింప జేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది.