కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి రాజగారి గ్రౌండ్ లో సోమవారం సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు రెండో రోజు భారీ ఎత్తున బెట్టింగులు చేతులు మారినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా చుట్టు పక్కల ఊరుల నుండి జాతి రకమైన కోడి పుంజులు తీసుకురావడం జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి కోడిపందాలు ప్రియులు తండోపతండాలుగా వచ్చి వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.