అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం కిర్లంపూడి ప్రభుత్వ పాఠశాలలో మండల బీజేపీ అధ్యక్షుడు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో యోగా గురువులు తోట వీర రాఘవరావు, కార్యక్రమం ఇంచార్జ్ పల్లా రాము అధ్యక్షతన ఉదయాన్నే యోగసాధనలు చేయడం జరిగింది. అనంతరం ప్రతీరోజూ ఉదయాన్నే యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, మనస్సు ప్రశాంతతను పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల దుర్గాప్రసాద్, కంట కాశీ విశ్వనాధం, దొడ్డ అప్పారావు, శరకణం రాజబాబు, మచ్చ రమణ, ఏనుగు పిల్లి జలబాబు, దాలే విష్ణు, శ్రీనివాస్, కాళింగి. కాశీ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.