స్మార్ట్ సిటీ అర్ధాంధకారం పై కాగడా తో నిరసన

75చూసినవారు
కాకినాడ నగర పాలక సంస్థ పౌర సౌకర్యాల కల్పనలో ఎటువంటి ప్రగతి చర్యలు వహించడం లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కాగడా చేతపట్టి వెలగని వీధి దీపాల వద్ద నిరసన తెలిపారు. నగరంలో సగం దీపాలు వెలగడం లేదన్నారు. దుకాణాల లైటింగ్ వలన రాత్రి 11వరకు అంధకారం సమస్య తెలియడం లేదన్నారు. కార్పొరేషన్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్