పెద్దాపురం పట్టణంలోని పాత పెద్దాపురంలో శుక్రవారం కాకినాడ ఎక్సైజ్ పోలీసులు అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి పాత పెద్దాపురం ప్రాంతానికి చెందిన కుమారి వద్ద 40 నిబ్ బాటిళ్లు, సోమశేఖర్ వద్ద 19 నిబ్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు.