నాటు సారా అమ్ముతున్న వ్యక్తులు అరెస్టు

1905చూసినవారు
నాటు సారా అమ్ముతున్న వ్యక్తులు అరెస్టు
పెద్దాపురం నియోజకవర్గం, మండలం పాతపెద్దాపురం పరిధిలోని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించి నాటు సారాయి అమ్ముతున్న కోమలి రాజు, కోమలి యేసురత్నంలను మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 100లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని కాకినాడ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. నాటుసారా కొందరు వ్యక్తులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉందని, వారిపై కూడా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్