రాష్ట్రంలో వరద విలయానికి గత ప్రభుత్వమే కారణమంటున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పెద్దాపురం శివారులో ఏలేరు కాలువను, నీట మునిగిన పంట పొలాలను వైఎస్ షర్మిల పరిశీలించారు. ఏలేరు పూడిక తీయకపోవడం వలన తీవ్రంగా నష్టపోయామని, నష్ట పరిహారాన్ని రైతులను కాకుండా కౌలు రైతులకు ఇప్పించేలా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.