తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ సముద్ర తీరం గురువారం సాయంత్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. గంటకు 60 కిలోమీటర్ల పైగా వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఇటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కెరటాల తాకిడికి ఇళ్ళు పడిపోతున్నాయని తీరప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తుఫాన్ మరింత పెరుగుతుందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.