ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సీఐ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ లో పర్యటించిన ఆయన సందర్శకులు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్, ఆన్ లైన్ మనీ దొంగతనాల గురించి వివరించారు. బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు. ఎస్ఐ వెంకటేష్ తదితర సిబ్బంది ఉన్నారు.