AP: బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక కొండపై ఉన్న ముంతాజ్ హూటల్ అనుమతులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.