TG: ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు ముందు నిన్న ఓ యువతితో ఎస్సై రిసార్ట్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండటంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత నెలలో ఈయన విధులు నిర్వహిస్తున్న పీఎస్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని హత్య చేసారు. అప్పటి నుండి హరీష్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం.