అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలో నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్య ధికంగా 60. 8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. అదే విధంగా జిల్లాలోని రావులపాలెం, కపిలేశ్వరపురం మండలాల్లో అత్యల్పంగా 1. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 15. 4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయిందని చెప్పారు.