అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 155 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం ఆమె జిల్లా అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిపై అర్జీలు స్వీకరించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.