ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ శుక్రవారం నుంచి జాతీయ మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. బీచ్ వాలీబాల్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గురువారం పరిశీలించారు. డీఎస్పీ ప్రసాద్ తో కలిసి పోటీల నిర్వహణపై చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ముచ్చటించారు. పోటీల నిర్వహణలో ఎటువంటి జరగకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.