కోనసీమ బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్

71చూసినవారు
కోనసీమ జిల్లాకు రెండవ నూతన కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11: 30 గంటలకు అమలాపురం కలెక్టరేట్ లోని  కలెక్టర్ ఛాంబరులో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి జి.  కేశవవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్