శిధిలావస్ధలో ఉన్న ప్రభుత్వ గృహాల అభివృద్ధి చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ రవికుమార్ అన్నారు. ఈ మేరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె. సత్తిబాబు పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో విద్యకు 6% బడ్జెట్ కేటాయింపులు కావాలన్నారు.