అమలాపురం మండలం ఇందుపల్లి స్కూల్‌లో 10 వ తరగతి చదువుతున్న జితేంద్ర దొర, కడిమి నాని ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 74, 56 కేజీల విభాగంలో సబ్ జూనియర్స్ టైటిల్ సాధించారు. వచ్చే నెల 13, 14 తేదీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీఈటి నరసింహారావు బుధవారం తెలిపారు. విజేతలను హెచ్ఎం శ్రీనివాసరావు అభినందించారు.