అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో ఏర్పాటు చేసిన అమలాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత కుడిపూడి చిట్టబ్బాయి విగ్రహం తొలగించాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు బుధవారం వైసీపీ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు స్వగృహంలో సమావేశం అయ్యారు. పట్టణ అభివృద్ధికి కృషి చేసిన చిట్టబ్బాయి విగ్రహం తొలగింపు పట్ల సమావేశంలో ఖండించారు.