అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు పేరిట సీపీఎం నాయకులు, కార్యకర్తలు గురువారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని, నిత్యవసర సరుకుల ధరలను ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇష్టం లేని చోట్ల మద్యం షాపులు తొలగించాలన్నారు.