నివారణ చర్యలతో వ్యాధులు దూరం

50చూసినవారు
దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని అల్లవరం ఎంపీడీవో కృష్ణమోహన్ అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని బోడసకుర్రు గ్రామంలో మురికి గుంటలను పరిశీలించి లార్వా నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు. దోమలు వృద్ధి చెందకుండా, సీజనల్ వ్యాధుల నివారణ చర్యల గురించి స్థానిక ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్