అల్లవరం మండలం కొమరగిరిపట్నం బాబా ఆలయం, సీతారామాంజనేయ ఆలయాలకు చెందిన రెండు హుండీలను చోరీ చేశారు. హుండీలను ఎత్తుకుపోయి వాటిని బద్దలుకొట్టి నగదును తీసుకుపోయారు. కాయిన్స్ మాత్రం అక్కడే వదిలి వెళ్లిపోయారు. గురువారం స్థానికులు హుండీల దొంగతనాన్ని గుర్తించి అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అల్లవరం మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి.