ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, భీమనపల్లి, నంగవరం గ్రామాల్లో బుధవారం పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.