యూటీఎఫ్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో అమలాపురం బాలయోగి ఘాట్ లో జరిగిన టీచర్ ఒలింపిక్స్ క్రికెట్ పోటీల ఫైనల్స్ లో ఉప్పలగుప్తం టీం విజయం సాధించింది. ఫైనల్ పోటీల్లో పి. గన్నవరం టీమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్స్ విజేతగా నిలిచిన జట్టు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని ఉప్పలగుప్తం మండల శాఖ అధ్యక్షులు అత్తిలి సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు. విజేతగా నిలిచిన టీమ్ ను పలువురు అభినందించారు.