అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలు, కాలనీలలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితుల ఇళ్లల్లో విస్తృత చెకింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో సోమవారం వేకువజామునే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. పాత నేరస్తులు, మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో పశువుల పాకలు, గడ్డివాముల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.